Description
Dhairyam Ante? ధైర్యం అంటే?
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.
ఒక అమ్మాయికి టీకా వేయించుకోవటం అంటే భయం. అందరికీ ఏదో ఒక భయం ఉంటుందని వాళ్ల అమ్మమ్మ ద్వారా తెలుసుకుంది. అంతే కాదు ధైర్యం అంటే ఏమిటో కూడా తెలుసుకుంది. ఈ పుస్తకం చదివి అదేమిటో మీరు కూడా తెలుసుకోండి!