Description
Donga Bhadava దొంగ భడవ
రోహిత్ ఆరు సంవత్సరాల బాబు. జంతువులంటే ఎంతో ఇష్టం! డైనోసార్లు అంటే మరీ పిచ్చి! కానీ ఒక రోజు… జంతు ప్రదర్శనశాలకు వెళ్లటానికి తయారవుతున్నప్పుడు, తనకు ఇష్టమైన టి-రెక్స్ కనిపించకుండా పోతే? ప్రేమ, సరదా, కల్పన, నవ్వులు, ఆటలు కలసిన ఈ కథ చిన్నారులను ఊహల తివాచీపై మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఐదు పుస్తకాలలో ఇది ఒకటి.






