Description
Eddula Jodi ఎద్దుల జోడీ
Genre: సమకాలీన క్లాసిక్స్
అనువాదం: వేణు గోపాల కృష్ణ
ఇరవయ్యవ శతాబ్దపు ప్రఖ్యాత రచయితలలో ఒకరైన మున్షీ ప్రేం చంద్ (1880-1936) భారతీయ సమాజాన్ని లోతైన అవగాహనతో వాస్తవికంగా చిత్రిస్తారని పేరు గాంచారు. గత శతాబ్దపు మొదటి భాగంలో అతను జీవించినప్పటికీ అతని కథలు ఈనాటి జీవితాలకి కూడా వర్తిస్తాయి.
అన్ని జీవుల పట్ల ప్రేమ, ఆదరణ చూపటం గురించి ‘ఎద్దుల జోడీ’ (దో బైల్) కథ చెబుతుంది. తమ ఇంటి బయట ఎదురైన క్రూర ప్రపంచం చూసి హీరా, మోతీ అన్న ఎడ్లు ఖంగు తిన్నాయి. ఆ బయటి ప్రపంచం వాటిని అర్థం చేసుకోలేదు. వాటిని, ఇతర జంతువులను తమ అవసరాల కోసం అది వాడుకుంటుంది.
ఒక చిన్న అమ్మాయికి, నిర్లక్ష్యానికి గురి అయ్యే ఆమె అవ్వకి మధ్య అనుబంధం గురించి చెప్పే కథ ‘ముసలి అవ్వ’ (బుఢి కాకి). ఎవరూ పట్టించుకోకుండా ఆకలికి, చలికి అవ్వని వదిలి వేసే ఇంటిలో తన ఆర్ద్రతతో అవ్వ జీవితంలో వెలుగుని, సంతోషాన్ని బుజ్జి నింపింది.
Eddula Jodi ఎద్దుల జోడీ, Publisher: Amar Chitra Katha