Description
పెద్దయ్యాక ఏమి అవుతారో, ఏమి చేస్తారో చెప్పిన పిల్లలను ఇప్పుడు ఏమీ చెయ్యలేరా అని జ్యోతి టీచర్ అడిగారు. ఎందుకు చెయ్యం అంటూ పిల్లలు పనికి పూనుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న పిల్లలు ఇప్పుడు ఏం చేశారో, భవిష్యత్తులో ఏం కావాలనుకున్నారో ఈ కథ చెబుతుంది.
ఈ పుస్తకానికి ఎం. శ్రీకాంత్ బొమ్మలు వేశారు.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.