Description
Enugu Doctor ఏనుగు డాక్టర్
అబ్బుర పరచే ఒక దృశ్యం – డాక్టర్ ను వెతుక్కుంటూ వచ్చి, గున్న ఏనుగు వైద్యం చేయించుకున్న తరవాత ఏనుగులన్నీ కలిసి తమ ఘీంకారాలతో బృందగానంలా ధన్యవాదాలు తెలియచేశాయి! ఎవరు ఆ డాక్టర్?
మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు ప్రభుత్వ అటవీ శాఖలో పశువుల డాక్టర్ గా, ప్రత్యేకంగా ఏనుగులకు విశేష వైద్య సేవలు అందించి ఏనుగుల డాక్టర్ గా సుపరిచితులైన డా.కృష్ణమూర్తి అరుదైన వ్యక్తిత్వం గురించి అడ్వెంచరస్ కథ…
(పుస్తక పరిచయం: డాక్టర్ వియయలక్ష్మి – మన లైబ్రరీ, జహీరాబాదు)
రచయిత జయమోహన్ తొలినాళ్లలోనే రాసిన రబ్బర్, విష్ణుపురం అనే నవలలు; నది, బోధి, పడుగై వంటి కథలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పెట్టేవిగా ఉంటాయి.
2021లో ‘ఈమాట'(తెలుగు ఇ-పత్రిక), ‘నెమ్మి నీలం’ (ఛాయా రిసోర్సెస్ సెంటర్) లో ప్రచురించబడిన ఈ కథను పుస్తక రూపంలో మీ ముందుకు తెస్తున్నాం.