Description
1882లో రష్యాలో జన్మించిన యాకోవ్ పెరెల్మాన్ మేటి పాపులర్ సైన్స్ రచయితగా ప్రపంచ వ్యాప్తంగా మన్నన పొందాడు ఇతడు రాసిన Physics for Entertainment అనే పుస్తకం 1913లో విడుదలైన కొద్ది కాలంలోనే సంచలనం సృష్టించిం్ది. ఆ పుస్తకం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువాదం అయ్యి, ఎన్నో తరాల పాఠకులకు స్ఫూర్తిని ఇచ్చింది. ‘నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం’ అన్న పేరుతో తెలుగులోకి అనువాదం అయిన ఈ పుస్తకం ఎన్నో తరాల తెలుగు పాఠకులకి పాపులర్ సైన్స్ ప్రపంచంలోకి తొలి పరిచయం అయ్యింది. పెరెల్మాన్ ఇతర రచనలు ఎన్నో ఇంగ్లిష్ లోకి తర్జుమా అయినా తెలుగులో ఆయన రచనల అనువాదాలు పెద్దగా లేవు.
ఆ వెలితిని పూడ్చే ప్రయత్నంలో మొదటి మెట్టుగా పెరెల్మాన్ రాసిన ‘Maths for Fun’కి అనువాదాన్ని గణిత గారడీలు అన్న పేరుతో తెలుగు పాఠకులకి అందిస్తున్నాం.



