Description
Gollakonda Katha గొల్లకొండ కథ – గోల్కొండ వైభవం, పతనం
గోల్కొండ పటిష్ఠమైన కోటగా మారకముందు ఎలా ఉండేది? ఎవరి హయాంలో ఒక వెలుగు వెలిగింది? ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించడానికి కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను అందివ్వడంతో పాటు, మిమ్మల్ని ఒకసారి గతంలోకి తీసుకెళ్లి అప్పటి మనుషులు, వారి సంభాషణలు, యుద్ధాలు, సిరిసంపదలు – అన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ పుస్తకం. ఇది చదివిన తరువాత గోల్కొండను సందర్శించినట్టైతే, అక్కడి రాళ్లు, బురుజులు, గోడల కథలు కూడా మీరు ఇతరులకు చెప్పగలరు.








