Description
Indra Dhanassu Metlanu Ekki ఇంద్ర ధనస్సు మెట్లను ఎక్కి
జీవితం ఎన్నో సవాళ్లతో ఉంటుంది. పెద్దవాళ్లమైనా, చిన్నవాళ్లమైనా వాటిని ఎదుర్కోవాలి. కఠినమైన పరస్థితులను ఎదుర్కోవటాన్ని నేర్చుకోవటంలో ఎంతో చక్కటి అనుభూతిని మిగులుస్తుంది. ఇంద్ర ధనస్సు మెట్లు అన్న ఈ పుస్తకంలో ఆరు కథలు ఉన్నాయి. క్లిష్ట పరిస్థితులను పిల్లలు ధైర్యంగా ఎదుర్కొన్న అనుభవాలను ఇవి మనకు చెపుతాయి.
- ప్రియమైన అమ్మమ్మ అకస్మాత్తుగా చనిపోయిందని విన్న సుధ ఎంతో ఏడ్చింది. మనుషులు ఎందుకు చనిపోవాలి? చావు వాళ్లని ఎక్కడికి తీసుకుని వెళుతుంది?
- ఉంటున్న ఇంటిని వదిలి పెట్టి కొత్త ప్రదేశానికి వెళ్లటం చిన్నారి కేశవ్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. కొత్త స్నేహితులను, కొత్త జీవితాన్ని అతను ఊహించుకోలేకపోతున్నాడు.
- కొత్త కోణం నుంచి పరిస్థితులను చూడటం నేర్చుకున్న మాయ, అన్న దేవ్‌తో తగువులు లేకుండా చేసుకో గలిగింది.
- అమ్మా, నాన్నలు తనని ప్రేమిస్తున్నారని తెలిసినప్పటికీ, వాళ్లకి కూడా తమదైన స్థానం అవసరం అని గుర్తించిన అశ్విన్ ఎంతో ఘర్షణకు లోనయ్యాడు.
- బొద్దుగా ఉండే హర్ష ఊబకాయంపై అసాధ్యం అనుకున్న పోరాటాన్ని మొదలు పెట్టాడు.
- యుద్ధ విధ్వంసాన్ని ఎదుర్కొని తన కలలను సాకారం చేసుకోటానికి జాషువా ధైర్యంగా ప్రయత్నం చేయసాగాడు.
తమ భావోద్వేగాల సామర్థ్యానికి పరీక్ష పెట్టిన ఘటనలను ఈ ఆరుగురు హీరోలు ఎదుర్కున్నారు. కఠినమైన మార్గంలో తమ అదుపులో ఉన్నవాటి మీద వాళ్లు దృష్టి పెట్టారు. సమస్యల నుంచి పారిపోవటం కాకుండా వాటితో తలపడటం వాళ్లు నేర్చుకున్నారు. సమస్యలు, అవరోధాలను అధిగమించి వాళ్లు ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో నిలిచారు.
Indra Dhanassu Metlanu Ekki ఇంద్ర ధనస్సు మెట్లను ఎక్కి