Description
Janu Ane Nenu Naa Snehiturallu జాను అనే నేను, నా స్నేహితురాళ్లు
పదవ తరగతికి వచ్చిన జానూకి అందరి విద్యార్థుల లాగానే ఎన్నో కలలు. అన్నయ్య కిషోర్ కంటే బాగా చదివినా, ఇంటి పనులలో సహాయం చేసినా ఏనాడూ జానూని నాన్నమ్మ మెచ్చుకోలేదు. ఆడపిల్లలకు చదువు, కలలు అక్కర్లేదు అనుకునే నాన్నమ్మ ఆలోచనలు జానూని నిరాశపరచలేదు. తన చుట్టూ ఏ తప్పు జరిగినా, తన స్నేహితురాళ్లతో కలిసి దాన్ని ఆపాలని ప్రయత్నం జాను తప్పక చేస్తుంది. వాళ్ల టీచర్లు అందించిన ప్రేరణతో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలని కష్టపడి చదవి, పరీక్షలు రాశారు ఈ అమ్మాయిలు. ఇంతలో, వారి ఊరి తోటలో ఎదో అనుమానాస్పద పనులు జరుగుతున్నట్టు గమనించారు వాళ్లు. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలిగారా, లేక కష్టాలను కొని తెచ్చుకున్నారా? వారి కలలు ఏమయ్యాయి?
అమ్మాయిలు సాహసించి తలపెట్టిన పని పూర్తయిందో లేదో తెలుసుకోవాలంటే వారి కథ చదివేయండి మరి!
తానా – మంచి పుస్తకం పది సంవత్సరాల పైన పిల్లలకు నవలలు 2025లో ఎంపికైన అయిదు నవలలో ఇది ఒకటి.




