Jatagallu, Kathagallu జతగాళ్ళు, కతగాళ్ళు

75.00

తెలుగువాణిలో పని చేసే సందర్భంలో కెం.మునిరాజు, గౌనోళ్ళ సురేశ్‌రెడ్డిలకు పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ వేలూరు జిల్లాలో ఇరవై పల్లెల్లో వందల మందికి తెలుగు అక్షరాలు నేర్పించారు. ”నిజానికి అక్కడ మేం నేర్పించింది తక్కువ, నేర్చుకుంది ఎక్కువ,” అంటారు ఈ రచయితలు.

తరతరాలుగా, అన్ని ప్రాంతాలలో అవ్వలు, తాతలు చెబుతున్న కతలే ఇవి. తిమ్మక్క, పాపవ్వ, వెంకటవ్వ, కుంటవ్వ, నంజవ్వ, రామప్పలు చెప్పిన కథలను దేవిశెట్టిపల్లి పరిసరాలలోకి కూర్చి రాశారు. హోసూరు మాండలికంలో ఇంతకు ముందే వచ్చిన కతలను వ్యవహారిక తెలుగులో మళ్ళీ మీ ముందుకి తెస్తున్నాం. ఈ కథలు చదివితే చిన్నప్పుడు అవ్వ వడిలో కూర్చునో, తాత పక్కలో పడుకునో విన్న కతలు మళ్ళీ గుర్తుకొస్తాయి.