Description
ఐజాక్ అసిమోవ్ (1920 -1992) ప్రఖ్యాత శాస్త్రవేత్త. పిల్లల కోసం, పెద్దల కోసం 200కి పైగా పుస్తకాలు రాశాడు. ఇందులో విద్యార్థులకు ఉపయోగపడేవి, పాపులర్ సైన్స్, సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు ఉన్నాయి. How Did We Find Out? అన్న సీరీస్ కింద ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అందులో 32 పుస్తకాలను ఎలా తెలుసుకున్నాం? అన్న పేరుతో తెలుగులో ప్రచురించాం. ఏదైనా అంశం తీసుకుని దాని మొదలుకంటూ వెళ్లి అందులో మానవ అవగాహన, విజ్ఞానం ఎలా మారుతూ వచ్చాయో చెబుతారు. చక్కని బొమ్మలు అదనపు ఆకర్షణ. తెలుగు బాగా చదవగలిగితే విషయం అరటి పండు వలిచినట్టు అర్థమైపోతుంది.
ఎలా తెలుసుకున్నాం? – కాంతి వేగం
అధ్యాయాలు:
1. మీరు ఎప్పుడైనా మెరుపును చూశారా
2. అంతరిక్షం నుండి భూమికి
3. ప్రయోగశాలలో కాంతి వేగం కొలత
4. విశ్వము – కాంతి సంవత్సరాలు
5. సాపేక్షతా సిద్ధాంతం – కాంతి వేగం