Description
Katha Kadambam Pustaka Mala కథాకదంబం పుస్తక మాల – 4 పుస్తకాల సెట్
పిల్లల్లో చదవాలనే ఆసక్తిని కలిగించటానికి, చదివే సామర్థ్యం పెంచటానికి కథని ప్రధానంగా ఎన్నుకుని మంచి పుస్తకం అనేక ప్రయోగాలు చేసింది. వయస్సును బట్టి రంగుల బొమ్మలు, అక్షరం సైజు వంటివి మారుస్తూ అనేక పుస్తకాలను ప్రచురించింది.
పిల్లలు పైతరగతులకు వెళుతున్నారు. కానీ, చదవటంలో, రాయటంలో మాత్రం చాలా కింది తరగతి స్థాయిలోనే ఉంటున్నారు. పిల్లల పఠన సామర్థ్యం బట్టి వివిధ స్థాయులలో ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో తక్కువ ధరకు ఇప్పటివరకు 11 సెట్లలో 95 పుస్తకాలను ప్రచురించింది.
ఆదరణ పొందిన కథలు, పాటలు చిన్న పిల్లలకు అర్థం అయ్యే రీతిలో ప్రత్యేకంగా బొమ్మలు వేయించి కార్డుల రూపంలో కథా కదంబం పేరుతో 50 కార్డులు(200 పేజీలు) మంచి పుస్తకం ప్రచురించింగి. వీటి వల్ల తమ పిల్లలు తెలుగు బాగా చదవటం నేర్చుకున్నారని తల్లిదండ్రులు, పిల్లలతో పని చేస్తున్న వాళ్లు కొందరు తమ అనుభవాలను మాతో పంచుకున్నారు.
కథా కదంబం కార్డులు వెల ఎక్కువ ఉండటంతో సైజు తగ్గించి నలుపు, తెలుపులో తీసుకుని వస్తే ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయని మిత్రులు సూచించటంతో కథా కదంబం పుస్తక మాల పేరుతో నాలుగు పుస్తకాలను రూపొందించింది. మరింత మంది తెలుగు నేర్చుకోటానికి ఇవి తోడ్పడితే మంచి పుస్తకం ఆశయం నెరవేరినట్టే.







