Description
అమ్మానాన్నలు హఠాత్తుగా చనిపోవడంతో వ్యథ, దుఃఖంతో పోరాడుతున్న చిన్నారులు – ప్రియా, ప్రదీప్‌లు కొత్త ప్రపంచానికి అలవాటు పడాల్సి వచ్చింది. వాళ్లని నీలగిరి పర్వతాల మధ్యన ఉన్న కున్నూర్‌లో ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్లింది షీలా పిన్ని. రోజువారీ పనులతోనూ, అందమైన పరిసరాలతోనూ ఊరట చెందుతున్న ఆ చిన్నారులు హఠాత్తుగా ఒక రహస్య వ్యూహంలో చిక్కుకున్నారు. కిడ్నాప్, ఇంద్రజాలం, ఒక అద్భుతమైన బేకరీ, వింత మహిళలు, ఇంకా ఎన్నెన్నో! సాధారణంగా ఆ కొండ ప్రాంతం నిశ్శబ్దంగా, నిద్రాణంగా ఉండేది… కానీ ప్రియా, ప్రదీప్‌ల అనుభవం అందుకు భిన్నంగా ఉండి ప్రతి క్షణమూ ఉత్తేజితంగా ఉంటుంది.
నిమి కురియన్ రాసిన పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ అనువాదం.