Konte Bomma Sahasalu కొంటె బొమ్మ సాహసాలు

80

Description

పినోకియో ఒట్టి అల్లరి పిల్లడు. చదువు అంటే అతనికి గిట్టదు. కొత్త విషయం నేర్చుకోవం అంటే విసుగు. పనిచేయడమంటే పడనే పడదు. తిని తిరగాలన్నదే యావ. ఆటలు పాటలు తప్ప అతనికి ఇక ఏమీ అక్కరలేదు. అమ్మ నాన్న మాట వినడు. ఆకలయినప్పుడే వాళ్లు గుర్తొస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్లను తలచుకొంటాడు. జీవితం అంటే కేవలం వినోదం అనుకొంటాడు. అతనిది కొయ్య బుర్ర. ఏదీ సరిగా ఆలోచించడు. మంచి సలహా చెప్పేవాళ్లంటే మంట. పాడైపోయే మాట చెప్పేవాళ్లంటే ఇష్టం. అయితే చివరికి ఇదంతా మారిపోతుంది. పినోకియో చాలా మంచి పిల్లవాడయి పోతాడు. బాధ్యత నేర్చకొంటాడు. అందులో ఉన్న సంతోషాన్ని గ్రహిస్తాడు. సరదా సరదాగా మీ పిల్లలకి మంచి నడవడికను నేర్పే కథ, కొంటె బొమ్మ సాహసాలు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication