Description
లియొనార్డో ద వించీ ఇటలీ కళాకారుడు. యూరపు పునర్వికాస యుగాన్ని మరింత కాంతిమయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. లియొనార్డో శిల్పి, వర్ణ చిత్రకారుడు, లేఖా చిత్రకారుడు, స్థపతి, శాస్త్రవేత్త, ఇంజినీరు, జీవశాస్త్ర నిపుణుడు, మేధావి. అనేక రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను పునర్వికాస మానవుడు (renaissance man) అంటారు. అలా అనిపించుకునే హక్కు లియొనార్డోకి మించి మరెవరికీ ఉండదు. ఆయన 1452లో ఏప్రిల్ 15న పుట్టారు. 1519 మే 2వ తేదీన తన 68వ ఏట చనిపోయారు.




