Description
Manaku Manushulu Kavali మనకు మనుషులు కావాలి
హైదరాబాద్ మహానగరంలో 6వ తరగతి చదువుకుంటున్న ‘సహజ’ చురుకైన అమ్మాయి. తనకు ఎదురైన అనుభవాలను, వచ్చిన సందేహాలను, బడిలో నేర్చుకున్న అంశాలను, రకరకాల విషయాలను తల్లి రామసీత, తండ్రి విశ్వతో కూలంకుషంగా చర్చిస్తుంది. వారు కూడా తమ కూతురి అభిరుచులను తెలుసుకుని, ఆమెకు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అందరి జీవితాల్లోకి చొచ్చుకుని వస్తున్న కృత్రిమ మేధ (ఏ.ఐ.) గురించి సహజ తీవ్ర ఆలోచనలో పడింది. ఏ. ఐ. ప్రభావం ఉన్న రంగాలు కనిపించినప్పుడు ఆమెకు ఎన్నో సందేహాలు వచ్చాయి. అవన్నీ దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలే… ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆమె తెలుసుకోగలిగిందా? తన ఆలోచనలను పంచుకోవడానికి సహజ సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమేనా?
తానా – మంచి పుస్తకం పది సంవత్సరాల పైన పిల్లలకు నవలలు 2025లో ఎంపికైన అయిదు నవలలో ఇది ఒకటి.




