Description
Mayalokam మాయాలోకం
2024 లో ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడెమీ బాలసాహిత్య పురస్కారం ఈ నవల రచయితా పి. చంద్రశేఖర్ ఆజాద్ గారికి లభించింది.
ఒక పల్లెటూరిలో అయిదవ తరగతి చదువుతున్న బుల్లి, చిన్ని, గీతలు మంచి స్నేహితులు. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర కొంత కాలం ఉండటానికి బెంగుళూరు నుంచి వచ్చిన అశోక్ కూడా అయిదవ తరగతిలో చేరాడు. ఆ ముగ్గురు స్నేహితులతో కలిసిన ఎన్నో మార్పులకు కారణం అయ్యాడు.
ఆ బడిలోని సింహం మాస్టారు అంటే అందరికీ హడల్. బుల్లి వాళ్ల నాన్న ఊళ్లో పనులు లేక వలస వెళతాడు. మంత్రాలు వస్తే డబ్బులే కాదు, చదువు తోపాటు అన్నీ వస్తాయనుకుంటాడు బుల్లి. అలాంటి మంత్రాలు తనకు నేర్పమని ఒక సాదువును బుల్లి అడుగుతాడు. సాధువు ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయని బుల్లికి తెలియదు. చివరికి ఎవరి ఆశ నెరవేరింది? తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి.
ఈ పుస్తకానికి కె. వి. రావు బొమ్మలు వేశారు.
పిల్లలలో తెలుగు చదివే సామర్ధ్యాన్ని పెంచటానికి, పుస్తకాల పట్ల ప్రేమ కలిగించటానికి రచయితల నుంచి 10 ఏళ్ల పైబడిన పిల్లల కోసం నవలలను తానా – మంచి పుస్తకం ఆహ్వానించాయి. వాటిల్లో 2021లో బహుమతికి ఎంపికైన నవలలో ఇది ఒకటి.