Description
తల్లిదండ్రులు పిల్లల తొలి గురువులు. కానీ కొద్దిమంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లల పుట్టుక ముందు నుంచి అందుకు సిద్ధం అవుతారు. పిల్లలకు స్వతంత్ర వ్యక్తిత్వముందని గుర్తించే తల్లిదండ్రులు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటారు. పుట్టిన పిల్లలకు తమవంటూ అవసరాలుంటాయనీ, ఇష్టా ఇష్టాలుంటాయనీ, వాళ్లు ప్రపంచాన్ని తమదైన రీతిలో చూస్తారనీ, పరిశీలిస్తారనీ, తమదంటూ ఒక ప్రాపంచిక దృష్టి ఏర్పరచుకుంటారనీ ఎందరు గుర్తిస్తారు?
తల్లిదండ్రులే కాదు, పిల్లలంటే పట్టించుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.