Description
Mem Pillalam మేం పిల్లలంసృజనాత్మక చదువులతో సంబంధం ఉన్న వారికీ, పిల్లలని ప్రేమించే వాళ్లకీ జై సీతారాం పాటలు తెలియకుండా ఉండవు. పిల్లల కోసం మొత్తం 150కి పైగా పాటలను రాసి న జై సీతారా ంవాటిని మూడు పుస్తకాలుగా వైయాలని ప్రణాళిక వేసుకున్నారు.
సైక్లోస్టైల్డ్ ప్రతుల ద్వారా (మేం పిల్లలం, అక్కా చెల్లెళ్లం), ప్రచురితం కావడం ద్వారా (వెన్నెల విందు, బాలల జెండా), జై సీతారాం స్వయంగా పాడి, రికార్డింగా చేసిన ఆడి.ో కాసెట్ ద్వారా ఆయన పాటలు ఎంతో ప్రచారం పొందాయి.
జై సీతారాం గేయాలు బాలల్లో ఊహాశక్తినీ, పరిసరాల పట్ల ప్రేమనూ, ఆధునిక విజ్ఞాన శాస్త్రం పట్ల ఆస్కతినీ, జీవితం పట్ల మమకారాన్నీ పెంచుతాయి. లయబద్ధతతో జై సీతారాం పాటలు ఎంతో హాయిగా ఉంటాయి. రంగులు, రుచులు, ధ్వనులు వంటి భావాలను చక్కగా పాటలుగా మలిచారు. చాలా పాటలు ప్రశ్న-సమాధానం పద్ధతిలో ఉంటాయి.
Mem Pillalam మేం పిల్లలం