Description
మైకెలాంజిలో అన్నది మేధో ప్రపంచానికి సుపరిచితమైన పేరే. ఇకా కళా రంగంవో అయితే అత్యంత ప్రియమైన పేర్లలో అది ఒకటి. ప్రపంచానికి ఇటలీ అందించిన ఇద్దరు మహా కళాకారుల్లో ఒకరు మైకెలాంజిలో. ఆయన ఉమ్మడి శకం 1475లో పుట్టాడు. తన 89వ ఏట 1564లో చనిపోయాడు.
ఆయన శిల్పి, చిత్రకారుడు, కవి. అన్నిటా ఆయన దిట్టే.
కళ ద్వారా కళాకారుడు ఆవిష్కరించే సౌందర్యమే దైవం అన్నది మైకెలాంజిలో భావన. ఆయన అద్భుతమైన చిత్రకారుడు. అయినప్పటికీ, చిత్ర కళ కంటే శిల్ప కళను ఎక్కువ అభిమానించేవాడు. “శిల్పానికి సన్నిహితంగా వచ్చే చిత్రాన్ని అభిమానిస్తాను, చిత్రానికి సన్నిహితంగా వచ్చే శిల్పాన్ని అసహ్యించుకుంటాను,” అని మైకెలాంజిలో అనేవాడట. ఇది మరో మహా కళాకారుడైన లియొనార్డో ద వించీ భావనకు భిన్నమే కాక విరుద్ధం.




