Mokshagundam Visvesvaraya మోక్షగుండం విశ్వేశ్వరాయ

100

Description

భారత దేశం గర్వించదగిన ఇంజనీరు అనగానే మనసులో మెదిలేది మోక్షగుండం విశ్వేశ్వరాయే. నెహ్రూ ప్రభుత్వం 1955లో ఆయనను భారత రత్నతో సత్కరించింది. గంగా నదిపై వంతెన ఎక్కడ కట్టాలి అన్న విషయంలో విశ్వేశ్వరాయనే నెహ్రూ సలహా అడిగాడు.

హైదరాబాదు నగరాన్ని మూసీనది వరదలు ముంచెత్తుతున్న కాలంలో వాటిని నివారించడం కోసం 1922-23లో ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్‌లను నిర్మింప చేసినది విశ్వేశ్వరాయే. మైసూరు చీఫ్ ఇంజినీరుగా, మైసూరు దివానుగా మైసూరు ముఖచిత్రాన్ని మార్చివేసినవాడు విశ్వేశ్వరాయే.

అంతేకాదు అనేక సంస్థానాలలో అత్యవసర ఇంజినీరింగ్ సేవలు, అనేక నగరాలకు అనితర సాధ్యమైన సేవలు అందించిన వ్యక్తి విశ్వేశ్వరాయే.

తన 102 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో చిట్టచివరి వరకూ దేశమంతటా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో సేవలను విశ్వేశ్వరాయ అందించారు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication