Description
Na Puttina Roju Eppudu? నా పుట్టిన రోజు ఎప్పుడు?
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.
అక్క పుట్టిన రోజు జరుపుకుంటూ ఉంటే తన పుట్టిన రోజు ఎప్పుడు అని చిన్నూ ఆత్రుత పడుతూ ఉంటుంది. అమ్మని అమాయకంగా, ‘నాకు పుట్టిన రోజు కావాలి,’ అని అడుగుతుంది. ఆ సంబురం కోసం ఎదురు చూడటం చిన్నూకి ఎంత కష్టంగా ఉందో, ఆమె మరీ నీరసపడిపోకుండా ఉండటానికి అమ్మ కూడా అంతే కష్ట పడింది. చిన్నూ తోపాటు ఆమె పుట్టిన రోజు కోసం మీకు కూడా ఎదురు చూడాలని ఉందా? అయితే పుస్తకంలోకి వెళ్లిపోండి.