Description
Naaku Nenu Telise నాకు నేను తెలిసే
కౌమారం అనేది భౌతికంగా ఎంతో వేగంగా ఎదిగే దశ. ప్రత్యేకించి ఆడపిల్లల్లో కౌమార దశ ఆరంభంలో ఎన్నో మార్పులు ఎంతో వేగంగా వస్తూ ఉంటాయి. ఈ మార్పుల వల్ల ఆడపిల్లల్లో తమ శరీరం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి.
ఈ దశలో ఆడపిల్లలు రుతుస్రావానికి సిద్ధంగా లేకపోతే అది ఒక పెద్ద గందరగోళంగా పరిణమిస్తుంది. రుతుస్రావంలో రక్తం పడటంతో శరీరం లోపల భాగాలేమైనా దెబ్బ తిన్నాయేమోనన్న భయం కలుగుతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి తనకు జరిగింది చెబితే దానికి సరైన వివరణలు ఇచ్చే పరిస్థితిలో తల్లి ఉండకపోవచ్చు. సరయిన వివరణలు దొరకకపోవటంతో ఆడపిల్లలు భయానికి లోనవుతారు. వాళ్ళల్లో చిత్ర విచిత్రమైన ఊహలు బయలుదేరతాయి. రుతుస్రావం పట్ల ఉన్న నమ్మకాలు, ఆచారాలు వల్ల ఆడపిల్లలు మరింత గందరగోళంలో పడతారు. ఈ విషయాలు పాఠ్యాంశాలలో ఉన్నప్పటికీ, చాలా మంది టీచర్లు ఇవి సున్నితమయిన విషయాలంటూ వీటిని దాటేస్తారు. వీటిని విద్యార్థుల ‘ఇష్టా’నికి వదిలేస్తారు. తోటి స్నేహితుల అరకొర జ్ఞానం, దిన, వార పత్రికలలోని శీర్షికలు తప్ప సమాచారం దొరకదు.
ఆడపిల్లల శరీరంలో ఈ మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అన్న విషయాలు తెలిస్తే భయం పోయి, ఈ విషయాలను సహజంగా తీసుకొని ఆరోగ్యంగా ఎదుగుతారు. ఆడపిల్లలకు అవసరమయిన విజ్ఞానాన్ని అందచెయ్యటమే ఈ పుస్తకం ఉద్దేశం.
హిందీలో “బేటీ కరే సవాల్” అనే పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని కె. సురేష్ తెలుగులోకి అనువదించారు.
Naaku Nenu Telise నాకు నేను తెలిసే