Description
Naaku Nidra Ravatamledu నాకు నిద్ర రావటం లేదు
అది ఆడుకునే సమయం కాదు. కానీ మూడేళ్ల విన్నీకి అప్పుడే నిద్ర రావటం లేదు. ‘కళ్లు మూసుకుని పడుకో!’ అని చెప్పకుండా, నాన్న విన్నీని దగ్గరికి తీసుకుని ముచ్చట్లు చెబుతూ నిద్రపుచ్చాడు. విన్నీ అడిగిన పని మరుసటి రోజు చేస్తానని పడుకోబోయే ముందు మాటిచ్చాడు కూడా. తన మాటను నిలబెట్టుకున్నాడో లేదో మీరే చూడండి.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఐదు పుస్తకాలలో ఇది ఒకటి.






