Description
Nenu Buddigane Unta! నేను బుడ్డిగానే ఉంటా!
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.
చిన్నగానే ఉండటం బుడ్డికి ఇష్టం. అలా అనుకోటానికి ఆమె చాలా కారణాలు చెప్పింది. అమ్మ చెప్పిన ఒక్క మాటకి బుడ్డి తన అభిప్రాయం మార్చేసుకుంది. చిన్నగా ఉండటానికి బుడ్డి చెప్పిన కారణాలు తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి.