Nerchukuntoo… Nerputoo… నేర్చుకుంటూ… నేర్పుతూ…

70

Description

Nerchukuntoo… Nerputoo… నేర్చుకుంటూ… నేర్పుతూ… –  ఒక ఉపాధ్వయాయుడి కథ

ఈ పుస్తకం బోధనకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడి ఆత్మ కథ.  అనేక ప్రయోగాలు, వాటి ఫలితాలు, అనుభవాలు, అనుభూతులు ఇందులో చూడవచ్చు. బడిలో ఎదురయ్యే సవాళ్లనూ, సమస్యలనూ ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకోవచ్చు.

·        పిల్లల చదువుల్లో భాషకున్న ప్రాధాన్యత ఎంత? భాషాసామర్థ్యాలు (చదవడం, రాయడం) సంపాదించడంలో వ్యాకరణానికున్న ప్రాధాన్యత ఏమిటి? పిల్లలు తప్పులు లేకుండా రాయాలంటే ఏమి చేయాలి?

·        గణితం కష్టమని పిల్లలు ఎందుకు భావిస్తారు? గణితం కష్టమా, సులభమా? ఏది నిజం?

·        హైస్కూల్లో ఆరవ తరగతికున్న ప్రాధాన్యత ఎంత?

·        ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థికి భాష, గణితం రెండు సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్ నేర్చుకోడానికి ఎంత కాలం పడుతుంది?

·        డ్రాపౌట్స్‌కు పిల్లల కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణమా? బడే కారణమా!

·        పిల్లలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయులు – పిల్లల మధ్య సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ పుస్తకంలో చూడవచ్చు.

Nerchukuntoo... Nerputoo... by c v krishnaiah manchi pustakam telugu book on education

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication