Description
ఆన్ ఫ్రాంక్ (1929 జూన్ 12 – 1945 ఫిబ్రవరి) యూదు బాలిక. దర్మనీలో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో పుట్టింది. ఆమె నాలుగేళ్ల పాపగా ఉండగా జర్మనీ నాజీల అదుపులోకి వచ్చింది. ఫ్రాంక్ కుటుంబం ఆంస్టర్‌డాం (నెదర్లాండ్స్)కి తరలి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు 1940లో నెదర్లాండ్స్‌ని అక్రమించుకున్నారు. 1942 జులై నుంచి నెదర్లాండ్స్‌లో ఉన్న యూదులను నాజీలు మరింతగా హింసించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ కుటుంబానికి రహస్య జీవనం మొదలయ్యింది. 1944 ఆగస్టులో ఒక ద్రోబం వల్ల వారు నాజీలకు దొరికిపోయారు. రహస్య జీవితం గడిపినంత కాలం (1942 జూన్ 12 నుంచి 1944 ఆగస్టు వరకూ) ఆన్ ఫ్రాంక్ డైరీ రాసుకుంది. నాజీల నిర్బంధ శిబిరంలో ఆమె చనిపోయింది. ఆమె తండ్రి ఒట్టో ఫ్రాంక్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరూ నాజీ శిబిరాల్లోనే చనిపోయారు. రహస్య కాలంలో ఆ కుటుంబానికి సహాయకునిగా ఉన్న మియప్ గీస్ చేతిలో ఆమె డైరీ భద్రంగా ఉంది. నాజీ శిబిరం నుంచి ఒట్టో ఫ్రాంక్ బతికి బయటకి వచ్చాక ఆ డైరీని వారు ముద్రించారు.




