Description
1817/1818లో పుట్టిన ఒక బానిస ఆత్మకథ ఇది. అతని పేరు ఫ్ెడరిక్ డగ్లస్. ఇందులో ఆయన తాను బానిసగా బతికిన రోజులను కళ్లకు కట్టినట్టు చిత్రించాడు. మేరీల్యాండ్ నుంచి న్యూ యార్కుకి ఎలా పారిపోయి వచ్చాడో వివరించాడు. అమెరికాలో బానిసత్వాన్ని నిషేధించాలనే ఉద్యమానికి ఆయన క్రమంగా గొప్ప నాయకుడు అయ్యాయడు. ఆయన ఒక వక్తగా, రచయితగా, నాయకునిగా, మేధావిగా ఎలా రూపొందిందీ మనకు ఈ పుస్తకం చెలియచేస్తుంది. దళితుల మేధాశక్తి గురించి చులకన భావం ఉన్నవారికి అంబేద్కర్ జీవితం సమాధానం చెప్పినట్టే, నల్ల బానిసల జ్ఞానం గురించి ఎగతాళి చేసిన బానిస యజమానుల కూతలకు డగ్లస్ జీవితం అటువంటి తిరుగులేని జవాబు ఇచ్చింది.




