Description
సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
పడవ ప్రయాణం అన్న ఈ పుస్తకంలో కప్ప, కొడిపిల్ల, ఎలుక, చీమ, ఆరుద్ర పురుగు స్నేహితులు. అవి షికారుకి వెళ్లాయి. దారిలో కాలవ కనపడితే కప్ప నీళ్లలోకి దూకింది. ఈత రాని మిగిలిన వాటిన చూసి కప్ప నవ్వింది. అప్పుడు మిగిలిన స్నేహితులు ఏం చేశాయి? చివరికి ఎవరు నవ్వారు?