Description
Pakshulanu Chuddam పక్షులను చూద్దాం
పక్షులను చూడటాన్ని మనం ఉన్నచోటు నుంచే మొదలుపెట్టవచ్చు. ఇందుకు ఓర్పు కావాలి. సాధారణంగా కనపడే పక్షులతే మొదలు పెడితే నెమ్మదిగా కొత్త, కొత్త పక్షులు మనకు కనపడతాయి.
సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో పక్షులు చాలా చురుకుగా ఉంటాయి. మర్రి, రావి చెట్లు పండ్లతో ఉన్నప్పుడు; బూరుగదూది, మోదుగ వంటి చెట్లు పూలతో ఉన్నప్పుడు అనేక రకాల పక్షులు వాటి మీదకు చేరతాయి.
పక్షులను పరిచయం చేయటానికీ, వాటి పట్ల ఆసక్తి కలిగించటానికీ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
రమణ కుమార్ పక్షులను పరిచయం చేయగా సచిన్ జల్తారే రంగుల బొమ్మలు వేశారు.
56 పక్షులను రంగుల బొమ్మలతో పరిచయం చేశారు.
పక్షుల వివరణ, వాటిని ఎలా చూడాలి, ఎలా ఆకర్షించాలి అన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.