Description
Peddayyaka పెద్దయ్యాక
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.
తొమ్మిది సంవత్సరాల రీతూకి ఆ వయస్సు అందరి పిల్లల లాగే కొత్తగా ఏది చూస్తే అదే కావాలని అనుకుంటుంది. పెద్దవాళ్లు మాత్రం ఆమె ఆశల మీద నీళ్లు చల్లుతుంటారు. దాంతో విసుగెత్తిపోయిన రీతూ తీసుకున్న నిర్ణయం ఏమిటో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.