Description
లియో టాల్‌స్టాయ్ (1828 – 1910) నవలాకారుడు, చిన్న కథల రచయిత, తత్వవేత్త. యుద్ధము-శాంతి, అన్నా కెరనీనా అన్న నవలలకు అతడు ప్రఖ్యాతి గాంచాడు. సంపన్న కుటుంబంలో పుట్టిన టాల్‌స్టాయ్ చాలా సాదా జీవితం గడిపేవాడు. అతడు క్రీస్తు నైతిక బోధనలను బలంగా నమ్మాడు. ఎటువంటి అధికారాన్ని సమ్మతించని అనార్కిస్టు అతడు. యుద్ధాలను వ్యతిరేకించిన టాల్‌స్టాయ్ పిల్లల కోసం ఎన్నో కథలు రాశాడు. ఈసాపు కథలను రష్యన్‌లోకి అనువదించటానికి అతడు ప్రత్యేకంగా గ్రీకు భాష నేర్చుకున్నాడు. అయితే, ఈసాపు కథలలో చివర ఉండే నీతి వాక్యాన్ని టాల్‌స్టాయ్ తీసేసాడు. ఈ కథల నుంచి ఏమి తెలుసుకోవలన్నది పిల్లలకే వదిలేయాలన్నది అతని అభిప్రాయం.
టాల్‌స్టాయ్ రాసిన చిన్న కథలలో ‘Ivan the Fool’ ఒకటి. దీనిని అతడు 1886లో రాశాడు. ఈ కథకి తెలుగు అనువాదమే ‘పిచ్చి పుల్లయ్య’. పుల్లయ్య రైతు కాగా అతడి అన్నలలో ఒకరు సైనికుడు, మరొకరు వ్యాపారి. వాళ్ల పనులు వాళ్లని ఎక్కడికెక్కడికి తీసుకెళ్లాయి, వాళ్ల మధ్య తగువులు పెట్టాలన్న ఉద్దేశంతో పిల్ల పిశాచాలు, దెయ్యం చేసిన ప్రయత్నాలు ఏమయ్యాయి? ఇది చదివి, మీరే తెలుసుకోండి.