Description
Purana Pada Bandhalu పురాణ పద బంధాలు
భాషను జీవభాషగా నిలిపి ఉంచడంలో సామెతలూ, నానుడులూ, పొడుపు విడుపులూ, నుడులూ, పలుకుబడులూ, జాతీయాలూ తమవంతు పాత్రని పోషిస్తాయి. పురాణాల నేపథ్యంలో మరిన్ని పద బంధాలు విడదీయలేని నిత్య అనుబంధమైపోయాయి. మణుగుల కొద్దీ మాటలకన్నా ఒక్క మాట చాలు. మాట వెనక మర్మాన్ని సయితం పట్టిస్తుంది. అందవలసింది అందిపోతుంది. చేరవలసింది చేరిపోతుంది.
అయితే రాజకీయార్థంలో చూసినప్పుడు పురాతనమే పురాణమైన పద బంధాల్లో ఆమోదించేవీ, విభేదించేవీ రెండూ కనిపిస్తాయి. దానికన్నా ముందు ఒకే జాతీయం/ పురాణ పద బంధం తీసుకుని చూస్తే లిఖితంలో ఒకలా, మౌఖికంలో మరోలా భిన్నంగా కనిపిస్తాయి. వాటి మధ్య వైరుధ్యమూ కనిపిస్తుంది.
అలాగని జాతీయాలను చెరిసేయలేం. ప్రజాస్వామికంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎవరి అభి’మతాలకు’ వారు బందీ కాకుండా ఉండాలి. జాతీయాలకు పురాణ పద బంధాలు పటుత్వాన్ని ఇస్తాయి. ఆధిపత్య భాషల కాళ్ళ కింద పడి కనుమరుగు కాకుండా కాపాడతాయి. అంతే కాదు, ఆడే మాటకు అర్థం తెలిసినప్పుడే అది అర్థవంతమైన మాటవుతుంది.