Description
Pustakalato Sneham Mithai Vasana L 3 S1-10 పుస్తకాలతో స్నేహం మిఠాయి వాసన L 3, S1-10
పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమని, పుస్తకాలు చదివే అలవాటుని పెంచటానికి,వాళ్లల్లో పఠన సామర్ధ్యాన్ని పెంచటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో పదేసి చొప్పున పుస్తకాలు ఉండే పది సెట్లతో మొత్తం వంద పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో శాంతివనం కూడా కలిసింది. ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి. మొత్తం మూడు లెవల్స్ లో పుస్తకాలు ఉంటాయి.
మూడవ లెవెల్లో మొదటి పది పుస్తకాలు ఇవి (L1S1 to L1S10). ఇందులో మొత్తం 22 కథలు ఉన్నాయి.
1) మిఠాయి వాసన డబ్బులు చప్పుడు మరో రెండు కథలు
2) గణిత పండితుడి గర్వభంగం మరో రెండు కథలు
3) స్నేహితుడిని తెలుసుకో! మరొక కథ
4) అవ్వ – పొట్టేలు మరొక కథ
5) బుల్లి మట్టి ఇల్లు మరొక కథ
6) ముల్లుపోయి కత్తి వచ్చే మరొక కథ
7) అవ్వ – కాకి మరొక కథ
8) చిలకముక్కు ఊడిపోయింది మరొక కథ
9) రేచీకటి అల్లుడు మరొక కథ
10) పిల్ల గుర్రం నదిని ఎలా దాటింది మరొక కథ