Description
పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమని, పుస్తకాలు చదివే అలవాటుని పెంచటానికి,వాళ్లల్లో పఠన సామర్ధ్యాన్ని పెంచటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో పదేసి చొప్పున పుస్తకాలు ఉండే పది సెట్లతో మొత్తం వంద పుస్తకాలు తీసుకురావాలని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో శాంతివనం కూడా కలిసింది. ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి. మొత్తం మూడు లెవల్స్ లో పుస్తకాలు ఉంటాయి.
మొదటి లెవెల్లో మొదటి పది పుస్తకాలు ఇవి (L1S1 to L1S10). ఇందులో మొత్తం 27 కథలు ఉన్నాయి.
1) గొడుగు గూడు మరో రెండు కథలు
2) నాట్యమాడుతున్న కుందేళ్లు మరో రెండు కథలు
3) తాబేళ్లూ ఎలుగుబంటి మరో మూడు కథలు
4) పురుగును పట్టుకున్న కోడిపిల్లలు!మరో మూడు కథలు
5) మూడు పిల్లి పిల్లలు
6) నేను కూడా… మరో రెండు కథలు
7) పడవ ప్రయాణం మరొక కథ
8) చీమ-పావురం మరో రెండు కథలు
9) కాకి – కడవ మరొక కథ
10) కోటయ్య కట్టిన ఇల్లు మరొక కథ