Description
Pustakalato Sneham Pandlu (Level 0) పుస్తకాలతో స్నేహం పండ్లు (L0, S1-10)
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో (ఐదు స్థాయిలలో) పది పుస్తకాల చొప్పున 10 సెట్లతో – మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.
మొదట స్థాయిలో పేజీకి 1-2 వాక్యాలు ఉండేలా చిన్న కథలతో ఎల్ 1 (Level 1) సెట్ ప్రచురించాం. అయితే పదజాలంతో కూడిన పుస్తకాలు కూడా ఉండాలని ఎల్ 0 (Level 0) లో కింది పది పుస్తకాలు ప్రచురించాం.
- పండ్లు
- కూరగాయలు
- పరిసరాలలో జంతువులు
- పక్షులు
- అడవిలో జంతువులు
- పూలు
- రవాణా సాధనాలు
- క్రియా పదాలు
- వ్యతిరేక పదాలు
- దృశ్యాలు
ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.