Description
Pustakalato Sneham Talli – Pilla (Level 3) పుస్తకాలతో స్నేహం తల్లి – పిల్ల (L3, S31-40)
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.
పుస్తకాలతో స్నేహం సిరీస్ లో మూడవ స్థాయిలో అయిదు పుస్తకాల నాల్గవ సెట్ ఇది:
- తల్లి-పిల్ల! – కె.ఎన్.వై. పతంజలి; తీర్పు – కాళీపట్నం రామారావు; ఎందుకు పారేస్తాను, నాన్నా! – చాగంటి సోమయాజులు
- గాయకుడు గోపి – వాద్యకారుడు పులి – ఉపేంద్కకిషోర్ రే చౌదరి; జ్యోతిష్యుని జీవితంలో ఒక రోజు – ఆరే.కె. నారాయణ్
- ఈద్ గాహ్ – ప్రేం చంద్; అతథి – సత్యజిత్ రే
- పోస్ట్ ఆఫీసు – రవీంద్రనాథ్ టాగూర్ (నాటిక)
- నీలం రంగు గొడుగు – రస్కిన్ బాండ్
ఈ పుస్తకాలకి శ్రీకాంత్ బొమ్మలు వేశాడు.
ఒక్కొక్క పుస్తకం 32 పేజీలు, మొత్తం 5 పుస్తకాలు 160 పేజీలు (కవర్ పేజీలు కాకుండా). మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.