Description
Pustakalato Sneham Yuddham (Level 3) పుస్తకాలతో స్నేహం యుద్ధం (L3, S21-30)
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో కథల పుస్తకాల సెట్స్ రూపొందించాం. ఐదు స్థాయిలలో (పది పుస్తకాల చొప్పున) 10 సెట్లు – అంటే మొత్తం వంద పుస్తకాలు ప్రచురించ తలపెట్టాం. ప్రతి సెట్ తో పఠన స్థాయి అంచలంచలుగా పెరుగుతుంది. ఈ ప్రయత్నంలో శాంతివనం, విజ్ఞాన ప్రచురణలు కూడా కలిసాయి. ఇప్పటి వరకు 11 సెట్లలో 95 పుస్తకాలు ప్రచురించాం.
పుస్తకాలతో స్నేహం సిరీస్ లో మూడవ స్థాయిలో పది పుస్తకాల మూడవ సెట్ ఇది:
- యుద్ధం
- నా తమ్ముడు మాథ్యూ
- మా చెల్లి బంగారు తల్లి & కొయ్యకాలు బేట్స్
- చక్రాల కుర్చీనే నాకు కాళ్లు
- ఇయాన్ షికారు & ఎడ్డీతో స్నేహంగా
- లూయీ బ్రేల్
- ధన్యవాదాలు మిస్టర్ ఫాల్కర్
- అమ్మకి జుట్టు
- అడుగు తీసి, అడుగు & వాళ్లిద్దరూ
- అజ్జీ
6వ పుస్తకానికి అవినాశ్ దేశ్‌పాండే బొమ్మలు తిరిగి వెయ్యగా, మిగిలినవాటికి శ్రీకాంత్ వేశాడు.
ఒక్కొక్క పుస్తకం 16 పేజీలు. మొత్తం నలుపు – తెలుపు బొమ్మలతో, సాధారణ కవరు పేజీతో రూపొందిన పుస్తకాలు ఇవి.