Description
Railu Badi రైలు బడి
చిన్ననాటి జ్ఞాపకాలను ఆకర్షణీయంగా చిత్రించిన ఈ పుస్తకం విద్యాబోధనతో వినోదాన్నీ, స్వేచ్ఛనూ, ప్రేమనూ కలగలిపిన రెండో ప్రపంచ యుద్ధకాలపు ఆదర్శవంతమైన టోక్యో పాఠశాల గురించి వివరిస్తుంది. ఆ అసాధారణమైన పాఠశాలలో పాత రైలు పెట్టెలే తరగతి గదులు. ఆ రైలు బడిని నడిపిన స్థాపకుడూ, హెడ్ మాస్టరూ సొసాకు కొబయాషి ఒక అపురూపమైన వ్యక్తి. భావ ప్రకటనా స్వేచ్ఛలో, కార్యాచరణలో దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తి.
ఈ పుస్తకంలోని టొటొ చాన్ వాస్తవ జీవితంలో జపాన్ లోకెల్లా అత్యంత జనాదరణ పొందిన టెలివిజన్ వ్యాఖ్యాత టెట్సుకో కురొయనాగి. ఆమె తన జీవితంలో సాధించిన విజయానికంతటికీ మూలాలు ఆ అద్భుతమైన పాఠశాలలో, దాని హెడ్ మాస్టర్లో ఉన్నాయని అంటారు.
జపనీస్ భాషలో 1981లో మొట్టమొదట వెలువడిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై భాషల్లోకి అనువాదమై అన్ని వయసులకూ చెందిన కోట్లాది మంది హృదయాలను చూరగొన్నది. భారతదేశంలోనే ఇది కనీసం పదకొండు భాషల్లోకి అనువాదమయింది.