Description
సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
ఒకసారి ఈగ, కప్ప, ముళ్లపంది, పుంజు కలిసి వెళుతున్నాయి. వాటికి దారిలో వేరు వేరు సైజుల్లో చక్రాలు ఉన్న ఒక బండి కనపడింది. ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం తీసుకుని వెళుతుంటే వాటిని చూసి ఒక కుందేలు నవ్వింది. ఆ చక్రాలతో ఈగ, కప్ప, ముళ్లపంది, పుంజు ఏం చేశాయి? చివరికి కుందేలు ఏమి అంది? తెలుసుకోవాలంటే రకరకాల బండి చక్రాలు అన్న పుస్తకం చదవాల్సిందే.