Description
పట్టణంలో చదువుకుంటున్న రక్ష సంక్రాంతి పండగకి నానమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. తాను చిన్నప్పుడు చదువుకున్న బడిని చూడటానికి స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. అది ఆమెకే నమ్మశక్యంగా లేదు, ఇంకా ఇతరులు ఏం నమ్ముతారు? రక్షకు మాత్రమే కనిపించే నల్ల బిలం ఆమెను ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్లింది. తెలియని లోకాలకు తీసుకుని వెళ్లటం తోపాటు తెలియని విషయాలు ఎన్నో తెలియచేసింది. కొత్త అనుభవాలు ఎదురయ్యాయి, కొత్త బంధాలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రుల రుణం తీర్చుకుని, అనుబంధాలను బలోపేతం చేసుకుంటూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోయే రక్ష వెంట మీరూ పరుగులు తీయండి.
ఈ పుస్తకానికి లోపలి పేజీల బొమ్మలు తెంబూరు సురేఖ, ముఖ చిత్రం విఠాల శరత్ చంద్ర వేశారు.
పిల్లలలో తెలుగు చదివే సామర్ధ్యాన్ని పెంచటానికి, పుస్తకాల పట్ల ప్రేమ కలిగించటానికి రచయితల నుంచి 10 ఏళ్ల పైబడిన పిల్లల కోసం నవలలను తానా – మంచి పుస్తకం ఆహ్వానించాయి. వాటిల్లో 2021లో బహుమతికి ఎంపికైన నవలలో ఇది ఒకటి.