Description
Rangula Ratnam రంగులరాట్నం (అకార్డియన్ స్టైల్ పుస్తకం)
అదిగో! అదిగో! అందాల పట్నం
పట్నంలోన బాల విహార్
బాల విహార్లో రంగుల రాట్నం…
కవికాకి కోగిర జై సీతారాం గారి కొన్ని గేయాలు ఇలా తెలుగు అకార్డియన్ పుస్తక రూపంలో మీ ముందుకు వచ్చాయి. అకార్డియన్ పుస్తకం అంటే కింద ఫోటోలో చూపించినట్టుగా బారుగా తెరుచుకుంటుంది.
ఈ పుస్తకంలో రెండు చిట్టి గేయాలు ఉన్నాయి – మొదటి 6 పేజీలలో ‘రంగుల రాట్నం’ , వెనక 6 పేజీలలో ‘కాకమ్మ నలుపు’. రెంటికీ ఎం.శ్రీకాంత్ వేసిన రంగురంగుల బొమ్మలు పిల్లల్ని ఆకర్షిస్తాయి!
ఇందులో మరో ప్రత్యేకత – పుస్తకంలో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి పాట రూపంలో కూడా ఆస్వాదించవచ్చు!
గాయిక: వి.ఎస్. పవిత్ర






