Description
ప్రపంచంలో అత్యుత్తమ శాస్త్రవేత్తలలో సర్ సి. వి. రామన్ ఒకరు. ఇతర దేశాల్లో మిగతా శాస్త్రవేతలకు ఉన్న వెసులుబాటు పరిస్థితులు ఆయనకు ఆనాడు లేవు. అరకొర వనరులతోనే, హేమాహేమీలైన విదేశీ సైంటిస్టులకు సమ ఉజ్జీ కాగలిగిన ధీశాలి ఆయన. ఆయన నొబెల్ బహుమతి గ్రహీత.
సంగీతాన్ని, శాస్త్రాన్నీ మేళవించిన ప్రజ్ఞాశఆలి ఆయన. ఆయన నిరాడంబరత్వం తెచ్చిపెట్టుకున్నది కాదు. అది ప్రదర్శన కోసమూ కాదు. యూరపు, అమెరికాలు తిరిగి వచ్చాక, అక్కడ వ్ణ వివక్ష గురించి అడిగితే, భారత దేశంలో లాగానే అక్కడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు అనగలిగిన సత్యవాది ఆయన.




