Description
Srimathi Unnigari Tamasha Sweaterlu శ్రీమతి ఉన్ని తమాషా స్వెట్టర్లు
శ్రీమతి ఉన్ని అల్లిన స్వెట్టర్లు చాలా అందంగా వుండేవి. కానీ వాళ్ళు ఉండే ఊరు ఎప్పుడూ ఎండగా ఉండటంతో ఎవరికీ స్వెట్టర్లు వేసుకునే అవసరం ఉండేదికాదు.
అందుకని ఒక రోజు శ్రీమతి ఉన్ని, అమ్మాయి అనిత కొండ శిఖరం పైన ఉండే ఊరికి మారారు. అది ఎంత ఎత్తున ఉందంటే, ఎప్పుడు కిటికీలు తెరిచినా మబ్బులు ఇంటి లోపలికి వచ్చేసి, ఏమీ కనిపించేది కాదు. తన చేతిలోని అల్లిక సూదులు కాని, ఊలు కాని కనిపించకపోయినా కూడా శ్రీమతి ఉన్ని అల్లుతూనే కూచుంది!
మరి అలా అల్లిన స్వెట్టర్లు ఎలా తయారయ్యాయి? వాటిని ఎవరైనా కొన్నారా? తెలియాలంటే ‘ శ్రీమతి ఉన్ని తమాషా స్వెట్టర్లు ‘ చదవండి!