Description
Ukrainian Folktales Set ఉక్రేనియన్ జానపద గాథలు సెట్
ఈ సెట్ లో 4 పుస్తకాలు ఉన్నాయి:
1. పెంపుడు తండ్రి
2. గొర్రెల కాపరి
3. తెలివైన కూతురు
4. ఎగిరే ఓడ
అద్భుత లోకం గురించీ, ఆ లోకంలోని వీరుల గురించీ చెప్పే కమనీయ జానపద గాథలు ఒక తరాన్నించి మరో తరానికి ఏనాటినుంచో అందుతునే ఉన్నాయి. లోకుల యుక్తి, చమత్కారం, హాస్యం తొణికిసలాడే గాథలు ఇవి. చాలా కాలం అవి మౌఖికంగానే ఉండిపోయాయి. శ్రోతలకి వాటిని వినిపించేవారు. అందుకనే వాటికి గాథలని పేరు వచ్చింది.
ఉక్రేనియన్ జానపద గాథలు అపారంగా ఉన్నాయి. పాతకాలం నాతి వీరుల్ని, సంఘటనల్నీ ఈ గాథల్లో అడుగు అడుగునా మనం చూస్తాం. సామాన్య ప్రజలలో ధైర్యం ఉన్న మనుషులూ, ఉల్లాసం కలిగించే సాహసకృత్యాలు, చలాకీగా ఉండే జంతువులూ, పక్షులు పాఠకులకి సంతోషం కలిగిస్తాయి.
ప్రకృతి గురించీ, పెంపుడు జంతువుల గురించీ ప్రాథమిక జ్ఞానాన్ని జానపద గాథలు పిల్లలకి అందిస్తాయి.
వీటిని విడిగా కూడా తీసుకోవచ్చు.