Vijayanni Sadhinchina Rocket Kurrallu విజయాన్ని సాధించిన రాకెట్ కుర్రాళ్లు

35.00

Description

అమెరికాలో, అర్ధ శతాబ్ద కాలం క్రితం ఒక మారుమూల గ్రామంలో, ఒక చిన్న పల్లె బడిలో ఒక పిల్లవాడు కనబరిచిన పట్టుదల వల్ల ఆ బడి మాత్రమే కాక ఆ గ్రామం అంతా ఎంతగానో ప్రభావితం అయ్యింది. 1957లో స్ఫుట్నిక్ అనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా లాంచే చేసిందన్న వార్తకి స్పందిస్తూ ఆ పల్లె బడికి చెందిన నలుగురు పిల్లలు తామే ఒక రాకెట్‌ని నిర్మించాలని బయలు దేరతారు. ఏ వనరులూ, వైజ్ఞానిక నేపధ్యమూ లేని ఆ పల్లెలో, ఆ పిల్లలు అష్టకష్టాలకు ఓర్చి, ఎన్నో విఫల ప్రయోగాలు చేస్తూ, అంచెలంచెలుగా తమ రాకెట్ డిజైన్‌కి మెరుగులు దిద్దుతూ, చివరికి ఒక చక్కని రాకెట్ నిర్మించగలుగుతారు. ఆ రాకెట్‌కి ఆ బృందానికి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభిస్తుంది.

వీరి కథ పుస్తకంగానే కాక సినిమాగా కూడా వచ్చి ఎంతో ఆదరణ పొందింది. నేతృత్వం గురించి, టీం బిల్డింగ్ గురించి ఈ వృత్తాంతం నేర్పే పాఠాలు బడి పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. గణితం, విజ్ఞానం తోపాటు నేతృత్వ నైపుణ్యాలు కూడా బడి స్థాయిలోనే పిల్లలకి నేర్పించాలనే ఆలోచనతో బడి పిల్లలకు స్ఫూర్తిని ఇచ్చే కథను ఈ పుస్తకం చెపుతుంది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication