Posted on

Interview> Eenadu Vasundhara

Published date: 3rd January, 2025

తార్నాకలోని మా దుకాణంలో కూర్చుని సైన్సు పుస్తకాల్ని చదివిని అబ్బాయి అమెరికా వెళ్లి ఆస్ట్రోఫీజిక్స్ లో పీ హెచ్ డీ చేస్తున్నాడు. తెలుగులో చదివి సైన్సుని సులభంగా అర్ధం చేసుకోవడంవల్ల ఇది సాధ్యమైందంటాడు. మాతృభాష గొప్పతనం అది.
చాలా మంది పిల్లలు మాకు ఫోన్ చేసి తాము చదివిన కథల గురించి చెబుతారు. మార్పు వస్తోందనడానికి ఇదే నిదర్శనం.

పి. భాగ్యలక్ష్మి
Posted on

Interview> Teacher Plus

Published date: June, 2024

A meaningful chat with Mr. Giridhar Rao (of Teacher Plus magazine) about the various aspects of choosing books, translations, illustrations, bilingual books, Soviet children’s books, non-fiction books and more.

Good children’s literature is necessary for Telugu’s health.

Suresh Kosaraju

Tell us a little bit about this changing Telugu-reading ability. What is your sense?

The picture is a complicated one, is it not? On the one hand, we have the ASER {Annual Status of Education Report] surveys telling is that a large proportion of 5th and 7th graders in government and low-fee paying private schools are not able to read even a 2nd grade Telugu text. On the other hand, there is the situation of Telugu students in high fee-paying English-medium schools. Although they may speak Telugu at home, Telugu reading is disappearing from their lives. Their exposure to written Telugu is very limited. These children are struggling to read even a 50-page Telugu novella; but they will read a 500-page Harry Potter novel in English with ease!

Posted on

Interview> VedikaTalks

Published date: 25th May, 2024

An unhurried chat with VedikaTalks about a wide variety of topics, beginning with Bala Sahithi being the foundation of Manchi Pustakam, our trust objectives, creating resources (in the form of engaging stories) for parents who wish for their children to learn and read Telugu, going against the grain in terms of book selection policies etc.

K.Suresh talks in detail about the various facets of picture stories, the genres and deeper meaning of folktales, the beauty of Soviet children’s books, and the fascination parents continue to have with ‘moral stories’.

There is also a discussion about the existing schooling system, our efforts to bring forth books regarding alternative schooling systems, and some stories that have left a lasting impression. The talk ends with some questions from listeners.

You can listen to the talk below:

You can view the Vedika YouTube channel here.

Posted on

Video Interviews > Maa Nava Lokam

When we celebrated ’20 years of Manchi Pustakam’ with an event/gathering on April 27th 2024, we were very fortunate and grateful for the Maa Nava Lokam team – not only for joining us on a special occasion, but also for taking the time to chat with so many of the attendees!

These beautifully captured conversations and snippets from the event are available on their YouTube channel.

Maa Nava Lokam team: interviews by M. V. Ramachandrudu, video & editing by Khaleel, background music by Bharani

For your convenience, we have grouped them into three categories:

  1. Manchi Pustakam related:
    • Invitation to the event – K.Suresh and P.Bhagyalakshmi (watch)
    • Laxmi, Trustee of Manchi Pustakam (watch)
    • Suresh, Trustee of Manchi Pustakam (watch)
    • Bhagyalaxmi, Coordinator, Manchi Pustakam (watch)
    • Kanakamma. Assistant, Manchi Pustakam (watch)
    • Srikanth, Artist (watch)
    • Sneha, Social Media Volunteer (watch)
  2. Those involved in helping books reach children:
  3. Readers and well-wishers:

Thank you, once again, to team Maa Nava Lokam for capturing memories we will cherish forever!

Posted on

Interview> Raitu Nestam

Published date: May 2024

రైతు నేస్తం మే 2024 సంచికలో ”మంచి పుస్తకం” 20 ఏళ్ళ వేడుక గురించి వచ్చిన ప్రత్యేక వ్యాసం వచ్చింది.

This is probably our favourite description of the ’20 years of Manchi Pustakam’ event that took place on April 27th, 2024. Excerpt from the article:

ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు. ఊరించే స్నాక్స్, లంచ్ మాత్రమే ఉన్నాయి. ఊహకు పదునుపెట్టే పుస్తకాలు ఉన్నాయి.

మీరు నమ్మరు. అక్కడికి వెళ్ళటానికి తార్నాక మెట్రో దిగి ఆటో నడిపే డ్రైవర్ ని సంప్రదిస్తే ఒకటే మాటన్నాడు… “పిల్లల పుస్తకాల కోసమేనా.. రండి పొద్దున్నుంచి చాలామందిని దింపాను” అన్నాడు. వెళ్లి చూస్తే, సందడంతా అక్కడే ఉంది… పిల్లలు, పెద్దలు కలిసిపోయి ఉన్నారు. బిస్కెట్లు, ఉడకబెట్టిన వేరుశనక్కాయలు, అరటి కాయలు, జామకాయలు తింటూ అటుఇటు పరిగెత్తే పిల్లలతో ఎంతో సందడిగా ఉంది ప్రాంగణమంతా. యూట్యూబ్ ఛానెల్ వాళ్ళ సందడి ఒకపక్క.. తీరిగ్గా, ఓపిగ్గా పుస్తకాలను పరిశీలిస్తూ పెద్దవాళ్ళు, వారితో కలిసి కొంచెం పెద్దపిల్లలు. ఇలా ఆట, పాటతో సందడిగా ఉదయం పది గంటల నుంచి కిటకిటలాడుతూ సేంట్ ఆన్స్ జెనరలేట్ కిలకిలలాడింది.

పిల్లల పుస్తకాలు ఎవరు చదువుతారు అన్న సంశయాన్ని కొంతైనా పటాపంచలు చేసింది “మంచి పుస్తకం” ఇరవై ఏళ్ల పండగ అనిపించింది.

-చెన్నూరు సీతారాంబాబు

Thank you, Seetharambabu garu for your words and for being a part of our special day!

The article also follows Suresh’s journey that began in a middle class agricultural household, to his current role in publishing children’s books in Telugu. Inclined towards agriculture since a young age, he speaks about the influence of MG Jackson ‘ హరిత విప్లవం ‘, about PhD scholar Gaya Prasad and Mr. Anil Sadgopal (of the non profit organization Kishore Bharathi) in shaping his views about alternative agricultural practices.

After completing his postgraduation, he returned to Andhra Pradesh to pursue a job as a journalist:

స్వరాష్ట్రానికి రావాలన్నా ఆకాంక్ష ముందు నుంచీ ఉంది. వివిధ పుస్తకాలు మొదటి నుంచి నన్ను బాగా ప్రభావితం చేసేవి. మధ్య ప్రదేశ్ నుంచి విజయవాడ రాగానే జర్నలిస్టుగా పనిచేయాలని అనుకున్నాను.
ఈలోపు ఈనాడులో ‘ రైతే రాజు ‘ లో పనిచేసే అవకాశం వచ్చింది. తెలుగు భాష, అనువాదంలో నా నైపుణ్యం అక్కడే రూపుదిద్దుకున్నాయి.
ప్రగతిశీల సాహిత్యం, పెద్దవాళ్ళ సాహిత్యానికి ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. పిల్లల సాహిత్యానికి అలాంటి ప్రత్యేక ఏర్పాటు లేదని గుర్తించాం.

Noticing the gap in publishing Telugu children’s literature, four friends (Subbayya, Bal Reddy, Rajendra Prasad and Suresh) started ‘Bala Sahiti’ in 1990. For about a decade, they worked on this passion project (while pursuing their regular jobs). The work done by Bala Sahiti would be the foundation for Manchi Pustakam, beginning in 2002. After a 14 year stint in a government job, and the encouragement provided at WASSAN (Watershed Support Services and Activities Network), Suresh ventured into the world of children’s books full-time.

Since the beginning, Manchi Pustakam went about their work in an unconventional way:

పిల్లలు అనేసరికి చాలా మందికి నీతి చెప్పాలని బలంగా ఉంటుంది. దేశభక్తి చెప్పాలని ఉంటుంది. భావి పౌరులుగా సమతారాజ్య నిర్మాతలుగా తీర్చిదిద్దాలని కూడా ఉంటుంది. అయితే, నా ఉద్దేశంలో మొట్టమొదటి కర్తవ్యం, పిల్లల్లో పుస్తకాలపై ప్రేమ పెంచడం. చక్కటి బొమ్మలతో, ఆసక్తి కలిగించే కథలతో, ఊహాశక్తిని పెంచే కల్పనలతో పిల్లల పుస్తకాలు ఉండాలి. ఇటువంటి పుస్తకాలు తీసుకురావటానికి ‘బాలసాహితి’ రోజుల నుంచి ఎదురీదటమే మా అనుభవం.
ఈసోపు కథలును టాల్స్టాయ్ తిరిగి రాసినప్పుడు, వాటి చివర్లో ఉండే నీతిని తీసేసారు. నీతి ప్రసక్తి లేని ఈసోపు కథలు ఒక్క ‘మంచి పుస్తకం’ వద్ద మాత్రమే లభిస్తాయి.

He signs off with gratitude for the hundreds of volunteers and well-wishers, and a zeal to see Telugu children’s literature soar.

ఏదైనా సంస్థకు బయటకి కనిపంచే ముఖం ఒక్కటే ఉండొచ్చు. అయితే, దానికి సహకరించే వాళ్ళ సంఖ్య వందల్లో ఉంటుంది.
మంచి పుస్తకం ద్వారా మాకు నచ్చిన పని, సంతోషాన్నిచ్చేది చేయగలుగుతున్నానని నమ్మకంగా చెప్పగలను.
పుస్తక ప్రచురణలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది.

You can view the full article here:

Posted on

Manchi Pustakam – A docu-journey by Kooch Productions

Published date: 26th May, 2024

We thank Rajesh, Ravi and team Kooch Productions Movies for putting together a very creative docu-journey of Manchi Pustakam’s 20 year event. Special thank you to Kooch’D and Sam Srinivas who created a catchy song for the occasion, surprising all of us!

Click here to watch the teaser.

Click here to watch the full video – includes the beginnings of our journey, a look around at the event, storytelling sessions, and a chat with some of our friends who attended the event.

A message of thanks:

వీడియో చాలా బాగా తీసిన కూచ్ ప్రొడక్షన్ కి అభినందనలు. తక్కువ సమయంలో అన్ని aspects ని cover చేస్తూ. అద్భుతంగా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆదరాభిమానాలతో మంచి పుస్తకం ప్రయాణం జరిగింది. ఇక ముందు కూడా జరుగుతుంది. పాట రాసి పాడిన వాళ్ల ఆలోచనకి ప్రత్యేక అభినందనలు.

P. Bhagyalakshmi
The team presented a special song – ‘మంచి పుస్తకం ఇది మంచి నేస్తం’
Posted on

Article> The New Indian Express ‘Unlocking Young Minds’

Published date: 25th April, 2024

Article from The New Indian Express’ Shrimansi Kaushik, that takes a look at new and emerging trends in children’s books. Speaking to various publishers (National Book Trust, Talking Cub, Penguin, Niyogi books), they gather that diverse/inclusive themes are gaining popularity, as well graphic novels and sci-fi genres.

When Manchi Pustakam was contacted regarding our experience, here is what we had to say:

You can read the full article here.

Posted on

Interview> ABN Andhra Jyothi అనగనగా ఒక ‘మంచి పుస్తకం’

Published date: 22nd April, 2024

An in-depth chat with Mr. Ommi Ramesh Babu of Andhra Jyothi – about what exactly is children’s literature, how Telugu books for children are being received, and roadblocks preventing the current generation from picking up more books.

ఏది బాల సాహిత్యం అని చెప్పడానికి నిర్దిష్ట ప్రమాణం ఏంటి?

భాగ్యలక్ష్మి: బాలలు అంటే 0-16 సంవత్సరాల వరకు ఉంటారు. వీళ్లు వివిధ ఆర్థిక, సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు. వయస్సును బట్టి బొమ్మల సంఖ్య, ఫాంట్‌ సైజ్‌లలో తేడాలు ఉంటాయి. ఇక కంటెంట్‌ విషయానికి వస్తే వైవిధ్యానికి అంతు ఉండదు. తల్లిదండ్రుల మధ్య ఘర్షణ ఉండే కుటుంబ నేపథ్యం, ఆడపిల్లల వేధింపులతో మొదలుకుని మురికివాడల పిల్లల బొమ్మల కథల వరకు అన్నీ పిల్లల పుస్తకాలే. ఏ పుస్తకం ఎవరికి, ఎందుకు నచ్చుతుందో, ఎలా ప్రభావితం చేస్తుందో మనకి తెలియదని మంచి పుస్తకం బలంగా నమ్ముతుంది. సాధ్యమైనన్ని పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచటమే మన పని.

We also discuss some publishing challenges in our 20 year journey, some memorable experiences, and what our focus is on next.

ఈ ప్రయాణంలో పరిపరి తలుచుకునే ఇష్టం సందర్భాల గురించి చెప్పండి?

భాగ్యలక్ష్మి: విభవసు అని ఒక అబ్బాయి చిన్నప్పటి నుంటి హెచ్‌బిఎఫ్‌లో మా స్టాలులో కూర్చుని సైన్స్‌ పుస్తకాలు చదువుకునేవాడు. తెలుగులో చదవటం వల్ల కాన్సెప్ట్స్‌ చాలా వరకు అర్థం అయ్యాయని, తోటి విద్యార్థులకు అనుమానాలు ఉంటే వివరించగలిగేవాడినని, తద్వారా ఎంతో నేర్చుకున్నానని విభవసు చెప్పాడు. ఆ కారణంగానే యాస్ర్టో ఫిజిక్స్‌లో ఆసక్తి ఏర్పడిందనీ చెప్పాడు. ఎంతో సంతోషం కదా!

హైదరాబాదు పుస్తక ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆఫీసు మూసివేస్తాం. ఆ సమయంలో నల్లగండ్లలోని తల్లిదండ్రుల దగ్గరకు అమెరికా నుండి వచ్చిన ఒక తల్లి తన కొడుకుతో ఆఫీసుకు వచ్చింది. ఆఫీసు మూసి ఉండటంతో అంతటి ఎండలో బుక్‌ ఫెయిర్‌కి వాళ్లు వచ్చారు. అక్కడికి రాగానే తనకి పరిచయం ఉన్న ‘కోటయ్య కట్టిన ఇల్లు’ కనపడటంతో దానిని తీసుకుని ఆ బాబు కింద కూర్చుని దాంట్లో మునిగిపోయారు. పెద్దవాళ్లు కూడా పిల్లలతో సమానంగా పుస్తకాలు చూసి ఆనందపడుతుంటే అవే మాకు ఆనంద క్షణాలు.

See the sweet picture from the incident mentioned above:

You can read the full interview here.