Description
చలనం సాపేక్షమైనది అనే విషయం సరిగా అవగాహన చేసుకుంటే చలనానికి సంబంధించిన అన్ని భావనలను సరిగా అర్థం చేసుకోవచ్చు.
ఒక చెట్టు కింద నిలబడి ఉన్న వ్యక్తి ఈ చెట్టు నిశ్చల స్థితిలో ఉంది (చలనంలో లేదు) అని చెప్పడం ఎంత సరైనదో, అదే చెట్టు పక్కన ఉన్న రోడ్డుపై బస్సలో ప్రయాణించే వ్యక్తి ఆ చెట్టు చలనంలో ఉంది అని చెప్పడం కూడా అంతే సరైనది.
గమ్మత్తుగా అనిపిస్తుంది కదా. అవును, చలనాన్ని ఎల్లప్పుడూ పరిశీలకుని పరంగానే నిర్వచించాలి. ఒక వస్తువు ఒక్కొక్క పరిశీలకుని పరంగా ఒక్కొక్క రకమైన చలన స్థితిలో ఉంటుంది.
వివరంగా తెలుసుకోవాలంటే ఈ చిన్న పుస్తకం చదవాల్సిందే.