Musali Gurram, Simham ముసలి గుర్రం, సింహం

40.00

కథల ప్రపంచం-1

ఇవి బైలోరష్యన్ జానపద కథలు. ఈ పుస్తకంలో రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ “ముసలి గుర్రం, సింహం”; రెండవ కథ “గోధుమ కంకి”.

మొదటి కథ ఓ ముసలి గుర్రం కథ. ముసలిదైపోయిందని దాని యజమాని దాని కాళ్ళకి నాడాలు కొట్టి, అడవిలో వదిలేస్తాడు. అది అక్కడ బాగా దొరికే గడ్డిని తృప్తిగా తింటూ కండపడుతుంది. ఓ రోజు అటుగా వచ్చిన సింహంతో వాదన పెట్టుకుని, దాంతో పందెం వేస్తుంది. ఆ పందెం ఏమిటి? ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలకు ఎన్. బైరాచ్ని గీసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. రంగుల మిశ్రమం ఆకట్టుకుంటుంది.

రెండవ కథ కోడి, బాతు, టర్కీ కోడిల కథ. కోడి తన పిల్లలకు తిండిగింజల కోసం కష్టపడుతుంటే, బాతు, టర్కీ కోడి మాత్రం ఏం పనీ చేయకుండా తామిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళే తేల్చుకోడానికి ప్రయత్నిస్తూంటాయి. కోడి ఆహారం సంపాదిస్తే, ఆ రెండూ వాటా కోసం బయల్దేరుతాయి. కోడి వాటికెలా బుద్ధి చెప్పిందనేది ఆసక్తిదాయకం. ఈ కథకు వి. బాసలైగా గీసిన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దలను సైతం ఆకట్టుకుంటాయి.

ఈ కథలు ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న చిన్న పిల్లలను వెలికి తీస్తాయి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇవి చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందుతారు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication