Description
Nenu – Na Cycle నేను – నా సైకిల్
సైకిల్ తొక్కడం నేర్చుకున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కథ ఉంటుంది. ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదల, నేర్చుకుంటున్నపుడు పడే పాట్లు, నేర్చుకున్నాక కలిగే ఆనందం… అన్నీ మరచిపోలేనివే! ఈ అనుభూతులు అన్నిటినీ అనన్య కథ ద్వారా ఆస్వాదించండి.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఐదు పుస్తకాలలో ఇది ఒకటి.







